న్యూఢిల్లీ, డిసెంబర్ 4: యాసిడ్ దాడి కేసు విచారణ 16 ఏండ్ల పాటు ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం యాసిడ్ దాడి కేసుల్లో జరుగుతున్న విచారణలపై స్వయంగా సుమోటోగా దృష్టి సారించింది.
తమ పరిధిలో పెండింగ్లో ఉన్న యాసిడ్ కేసుల వివరాల సమాచారాన్ని అందజేయాలని గురువారం హైకోర్టులను ఆదేశించింది.