Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.
బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి జేఈఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు (JEE aspirant). ఏడాది కాలంగా తన తల్లితోపాటు కోటాలోని తలవండి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అయితే, ఆదివారం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు కోట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యోగేష్ శర్మ తెలిపారు. విద్యార్థిది ఆత్మహత్యా..? లేక సహజ మరణమా..? అనేది ఇంకా నిర్ధారించలేదు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. శవపరీక్ష తర్వాతే విద్యార్థి మరణానికి గల కారణాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 16వ ఘటన కావడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
Also Read..
Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. 20 మంది మృతి
Hindu Temple | కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. ట్రూడో ఏమన్నారంటే..?