Himachal Pradesh | సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బిలాస్పూర్ జిల్లాలో పర్యాటకుల బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు సమాచారం.