న్యూఢిల్లీ, జూలై 18: రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఫిక్కీ-ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొంటున్న మరణాల్లో 11 శాతం భారత్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నది.
ప్రపంచంలో ప్రతి 24 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారని తెలిపింది. రోడ్డు ప్రమాదాల్లో భారత్లో ప్రతి ఏడాది మరణిస్తున్న వారి సంఖ్య, ఎస్తోనియా దేశ జనాభాతో సమానమని నివేదిక పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మరణాలకు ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఎనిమిదోదిగా ఉన్నది.