ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: 15 మంది జవాన్లు గల్లంతు!
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత సుమారు 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల హోరాహోరీ తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది.
ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, ఇద్దరు మృతదేహాలు లభించాయని వెల్లడించారు. గాయపడినవారిలో 23 మంది జవాన్లను జీజాపూర్ దవాఖానకు, మరో ఏడుగురిని రాయ్‌పూర్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. సుమారు 15 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో సుమారు 2 వేల మంది జవాన్లు పాల్గొన్నారు. బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సిల్గేరీ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న జవాన్లపై మావోయిస్టుల గెరిల్లాసైన్యానికి (పీఎల్జీఏ) చెందిన నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన నలుగురు జవాన్లు, కోబ్రా బెటాలియన్‌కి చెందిన ఒక జవాన్ మృతిచెందారు. అయితే కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్
పసి పెద్దలకు మాత్రమే!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chhattisgarh
- CRPF
- Jawans
- Missing
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

