ముంబై, మే 18(నమస్తే తెలంగాణ): ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, రెండు డజన్ల మందికిపైగా గాయపడ్డారు.
ఈ ఘటన పండుగ వాతావరణాన్ని విషాదంగా మార్చగా ముంబై మహానగర ప్రాంతమంతటా దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలూ బోల్తా పడ్డాయి. ఈ ఘోర ప్రమాదం వలన ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కాసేపు పూర్తిగా ఆగి పోయింది.