రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని బస్తర్ పోలీసులు వెల్లడించారు. కాగా, మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు.
Chhattisgarh: 12 Naxalites killed in an encounter with security forces in the forests under the National Park area of District Bijapur. Search operation is going on: Bastar Police pic.twitter.com/3Sgy8GVlcj
— ANI (@ANI) February 9, 2025
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ పోలీసులతో కలిసి డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
Chhattisgarh: 2 jawans lost their lives, 2 injured in an encounter with Naxalites in the forests under the National Park area of District Bijapur. Search operation is going on: Bastar Police
12 Naxalites have also been killed in the encounter https://t.co/6M8Z5sLzkv pic.twitter.com/QJXrM8W9k3
— ANI (@ANI) February 9, 2025
ఇటీవల ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు, నక్సల్స్‌కు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. త్వరలోనే దేశంలో మావోయిస్టు అనే పదం వినపడకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భద్రాతా బలగాలు వరుసగా మావోయిస్టులను మట్టుబెడుతున్నాయి.