Rajasthan | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.