Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మాండ్య జిల్లాలోని మద్దూరు నుంచి దక్షిన కన్నడ జిల్లా సుల్లియాకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మరో ప్రమాదం తమకూరు జిల్లా సిరా వద్ద జరిగింది.
ప్రైవేటు బస్సు, స్పోర్ట్స్ యూటిలిటీ వాహనం ఢీకొట్టుకున్న సంఘటనలో దంపతులు సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులను బెంగళూరు వాసులుగా గుర్తించారు. చిత్రదుర్గ చల్లకెరెకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత తీవ్రంగా ఉందని, ఎస్యూవీలో మృతదేహాలు చిక్కుకుపోయాని పేర్కొన్నారు. అయితే, ఎస్యూవీని ఢీకొట్టే ముందు ప్రైవేటు బస్సు రివైడర్ను ఢీకొట్టినట్లుగా సమాచారం. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాలకు గురవగా.. వారిని ఆసుప్రతికి తరలించారు.