నిత్యావసర సరుకుల పంపిణీ
మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల భరోనా
దేవరుప్పుల, మే 25: కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందజేసి ఆదుకుంటున్నాయి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ రెండేళ్లుగా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ అన్నారు. మండలంలోని బాధితులకు పంపిణీ చేసేందుకు మండలకేంద్రంలో మంగళవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులకు డ్రైఫ్రూట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్‌తో పాటు మండల నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, బస్వ మల్లేశ్ మాట్లాడుతూ కరో నా బారిన పడిన వారిలో రోగనిరోధకశక్తి పెంచేందుకు ట్రస్ట్ ద్వారా బలవర్థకమైన పదార్థాలతో కూడిన కిట్టును ప్రతి బాధితుడికి అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఈదునూరి నర్సింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ కారుపోతుల భిక్షపతి, సింగరాజుపల్లి సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేశ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చింత రవి, మండల ప్రధాన కార్యదర్శి నారెడ్డి సంజీవరెడ్డి, మండల నాయకులు కొల్లూరు సోమయ్య, కుతాటి నర్సింహులు, బస్వ వెంకన్న, అబ్బసాయిలు, బండి నర్సింహులు, తోకల రాజు, ఉపేందర్ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, 25 కిలోల బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు దారం రాజు, ఉపాధ్యక్షుడు కాసాని రమేశ్, కార్యదర్శి దారం రమేశ్, సంయుక్త కార్యదర్శి దారం మహేశ్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మొలుగూరి రమేశ్ పాల్గొన్నారు.
‘మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్’ ఆధ్వర్యంలో..
పాలకురి: మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గంట రవీందర్ ఆధ్వర్యంలో రాఘవపురం, మంచుప్పుల, రూరల్ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడెంలో కరోనా బారిన పడిన 30 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. కమిటీ సభ్యుడు పోతుగంటి నర్సయ్య మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంట రవీందర్ సూచన మేరకు బాధితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బొమ్మగాని కొమురయ్య, కాకర్ల రమేశ్, కార్యదర్శి మనోహర్‌స్వామి, సభ్యులు ఎడవెల్లి సోమేశ్వర్, ఎలమకంటి సందీప్, కృష్ణసాయి, మహేశ్, గణేశ్, శివ, నాగరాజు, శ్రావణ్ పాల్గొన్నారు.