Maoists | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 49 మందిపై కలిసి రూ. 1 కోటి వరకు రివార్డు ఉన్నట్లు తెలిపారు. సరెండర్ అయిన వారిలో 22 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. మావోయిస్టు భావజాలంపై అసంతృప్తి, సీపీఐ(మావోయిస్టు) పార్టీలో అంతర్గత కలహాల కారణంగా మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కరోజులో ఇంతమంది మావోయిస్టులు లొంగిపోవడం ఇదే తొలిసారి ఆయన స్పష్టం చేశారు.
సరెండర్ అయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణం సాయం కింద రూ. 50 వేల చొప్పున నగదు సాయం అందజేశారు. లొంగిపోయిన వారిలో రివల్యూషనరీ పార్టీ కమిటీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలో 410 మంది మావోయిస్టులు సరెండర్ కాగా, 421 మంది అరెస్టు అయినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
Chhattisgarh | 103 Maoists surrendered to authorities in Bijapur, leaving behind weapons worth more than Rs 1 crore. All the Maoists who surrendered and joined the mainstream of society were given a cheque of Rs 50,000 each as an incentive: IG Bastar P Sundarraj pic.twitter.com/xla6qA4gpq
— ANI (@ANI) October 2, 2025