న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారక తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. మరోవైపు బలమైన గాలులతో చెట్లు నేలకొరిగాయి. ద్వారకలోని ఖర్ఝరి కెనాల్ గ్రామంలో పొలంలో నిర్మించిన ట్యూబ్వెల్ గదిపై చెట్లు విరిగి పడటంతో నలుగురు మృతించారు. వారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతురాలిని 26 ఏండ్ల జ్యోతిగా గుర్తించారు. ఆమె భర్త అజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో సుమారు 40 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దిల్లీ ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. కాగా, ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులను కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
#WATCH | Waterlogging witnessed in several parts of Delhi as heavy rain lashes the national capital
(Visuals from Moti Bagh) pic.twitter.com/h1oIiYANjv
— ANI (@ANI) May 2, 2025
ఢిల్లీకి వెళ్లే, బయలుదేరే ఎయిర్ ఇండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీంతో మొత్తం విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నాం అంటూ ఎయిర్ ఇండియా ట్వీట్లో వెల్లడించింది. ఇండిగో కూడా తన ప్రయాణికులకు అలర్ట్లు పంపించింది. తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్చేసుకోవాలని సూచించింది.
#WATCH | Waterlogging witnessed in several parts of Delhi as heavy rain lashes the national capital
(Visuals from Moti Bagh) pic.twitter.com/h1oIiYANjv
— ANI (@ANI) May 2, 2025
కాగా, రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం 5.30 నుంచి 5.50 గంటల మధ్య ప్రగతి మైదాన్ ప్రాంతంలో 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది.
Recorded squally winds in gust at during 0530-0550 Pragati Maidan 78 kmph; Lodhi Road 59 kmph; Pitam Pura 59 kmph; Nazafgarh 56 kmph; IGNOU 52 kmph; Palam 62 kmph
Moderate to intense spell reported over Delhi. pic.twitter.com/3Qaoz9ykhc
— India Meteorological Department (@Indiametdept) May 2, 2025