న్యూఢిల్లీ: ఇటీవల లోక్సభ ఎన్నికల కారణంగా రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ అయ్యాయి. పది మంది ఎగువ సభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడమే ఇందుకు కారణం.
అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండు సీట్ల చొప్పున; హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక స్థానం చొప్పున ఖాళీలు ఏర్పడ్డాయని రాజ్యసభ నోటిఫికేషన్ తెలిపింది. ఈ రాజ్యసభ స్థానాలకు ఈసీ త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించనుంది.