పాట్నా : బీహార్ ప్రజలను పిడుగులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రెండు వారాల క్రితం పిడుగుల బారినపడి 40 మంది మరణించగా, శని, ఆదివారాల్లో వేర్వేరు చోట్ల పడిన పిడుగుల వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది.
మిస్ సుప్రనేషనల్ విజేతగా హైఫా జహ్రా
వార్సా, జూలై 7: మిస్ సుప్రనేషనల్-2024 పోటీల్లో విజేతగా ఇండోనేషియా భామ హరస్తా హైఫా జహ్రా నిలిచింది. శనివారం పోలండ్‌లో జరిగిన 15వ ఎడిషన్ తుది పోటీల్లో గెలిచి, అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకొన్నది. మొత్తం 68 దేశాలకు చెందిన అందాల భామలు ఈ మిస్ సుప్రనేషనల్ పోటీల్లో పాల్గొనగా, భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన సోనల్ కుక్రేజా టాప్-12లో నిలిచారు. అందాల కిరీటాన్ని దక్కించుకొన్న హైఫా జహ్రా ఆంత్రపెన్యూర్, మోడల్‌గా పని చేస్తున్నారు.