లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నారు. మరో 44 మంది శిశువులను రక్షించారు. అయితే వారిలో 16 మంది చిన్నారులు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు మంటల చెలరేగడంతో రోగులు, దవాఖాన సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలోఎన్ఐసీయూలో మొత్తం 54 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
#WATCH | Uttar Pradesh: Visuals from Jhansi Medical College, where a massive fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) last night.
The fire claimed the lives of 10 newborns pic.twitter.com/IL8gjieJOK
— ANI (@ANI) November 16, 2024
శుక్రవారం రాత్రి 10.45 గంటలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్ సచిన్మహోర్ తెలిపారు. మృతుల్లో ఏడుగురిని గుర్తించామని, మరో ముగ్గురికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
Uttar Pradesh’s Jhansi Medical College fire tragedy: On the instructions of the Chief Minister, assistance of Rs 5 lakh each is being provided to the parents of the newborn babies who died in the incident and Rs 50,000 each to the families of the injured from the Chief Minister’s…
— ANI (@ANI) November 16, 2024
ఈ ఘటన హృదయ విచారకంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. చిన్నారుల మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షలకు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రధాని మోదీ పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, రూ.50 వేల చొప్పున ప్రకటించారు.
PM Narendra Modi announces an ex-gratia of Rs 2 Lakhs from PMNRF for the next of kin of each deceased in the fire accident at Jhansi Medical College in Uttar Pradesh. He also announces Rs 50,000 for the injured. https://t.co/iePK7wt9et pic.twitter.com/7yIK8uDqWH
— ANI (@ANI) November 16, 2024
సీఎం ఆదేశాలతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నవజాత శిశువుల మరణం చాలా దురదృష్టకరని, ఘటనపై మొదటి దర్యాప్తు ఆరోగ్య శాఖ చేపడుతుందన్నారు. పోలీసులు రెండో విచారణ చేస్తారని వెల్లడించారు. అందులో అగ్నిమాపక విభాగం కూడా భాగమవుతుందని చెప్పారు. దీంతోపాటు మేజిస్ట్రేట్ స్థాయి విచారణ కూడా ఆదేశించామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించామని చెప్పారు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయం విచారణ నివేదిక వచ్చిన తర్వాతే చెప్పగలమని పేర్కొన్నారు.
#WATCH | Jhansi Medical College Fire tragedy | UP Deputy CM Brajesh Pathak says, ” In February, the fire safety audit was done. In June, a mock drill was also done. How this incident happened and why it happened, we can only say something about it once the probe report comes…7… pic.twitter.com/KTQe1Y5Sc3
— ANI (@ANI) November 16, 2024