Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Accident). వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (car rams trailer truck). ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నదియాడ్ (Nadiad)లోని అహ్మదాబాద్ – వడోదర ఎక్స్‌ప్రెస్‌వే (Ahmedabad – Vadodara Expressway)పై బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌వైపు వెళ్తోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది స్పాట్లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డెడ్‌బాడీస్‌ను రెండు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Naveen Patnaik | హింజిలీతోపాటు మరోస్థానం నుంచి పోటీ.. నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన
Surya Tilak | బాలరాముడికి సూర్యతిలకం.. లైవ్ ద్వారా వీక్షించిన ప్రధాని మోదీ