Air India Flight | ఎయిర్ ఇండియా విమానంలో మోగిన స్మోక్ అలారం.. లక్నోలో ల్యాండ్
Air India Flight | ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగను గుర్తించే అలారం మోగింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించిన తర్వాత ఆ ఫ్లైట్‌ను సాంకేతికంగా తనిఖీ చేశారు.
లక్నో: ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగను గుర్తించే అలారం మోగింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించిన తర్వాత ఆ ఫ్లైట్‌ను సాంకేతికంగా తనిఖీ చేశారు. (Air India Flight) గురువారం ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో 155 మంది ప్రయాణికులు ఉన్నారు.
కాగా, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత కార్గో ఉన్న చోట పొగను గుర్తించే అలారం మోగింది. దీంతో పైలట్లు అలెర్ట్ అయ్యారు. లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించారు. ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:52 గంటలకు ఆ విమానం లక్నో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది.
మరోవైపు విమానాశ్రయ స్పందన బృందం, అగ్నిమాపక సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఆ విమానం వద్దకు చేరుకున్నారు. అందులో ఉన్న 155 మంది ప్రయాణికులు, సిబ్బందిని కిందకు దించేశారు. ఆ తర్వాత ఆ ఫ్లైట్‌ను తనిఖీ కోసం హ్యాంగర్‌కు తరలించారు. ప్రాథమిక తనిఖీలో విమానం లోపల పొగ లేదా మంటల ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని లక్నో ఎయిర్పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే స్మోక్ అలారం మోగడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

