DRDO Apprentice | డీఆర్డీవో-సీవీఆర్డీఈలో 93 అప్రెంటిస్ ఖాళీలు
DRDO Apprentice | ఐటీఐ పూర్తిచేసిన వారిక డీఆర్డీవో సువర్ణావకాశం కల్పించింది. అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
DRDO Apprentice | చెన్నై ఆవడిలోని డీఆర్డీవో – కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDO-CVRDE) 93 ఐటీఐ అప్రెంటిష్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది. ఏడాది శిక్షణ గల ఈ పోస్టులకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హులు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు
ఐటీఐ అప్రెంటిస్ 93 ఖాళీల్లో అన్ రిజర్వ్డ్ (UR) అభ్యర్థులకు 40, ఓబీసీలకు 25, ఎస్సీలకు 13, ఎస్టీలకు 6, ఈడబ్ల్యూఎస్లకు 9 పోస్టులు కేటాయించారు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మన్ (మెడికల్), కార్పెంటర్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, షీట్ మెటల్ వర్క్, బుక్ బైండర్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఫొటోగ్రాఫర్, ఫుడ్ ప్రొడక్షన్ తదితర ట్రేడ్లలో ఉన్నాయి.

Iti Apprentice
అర్హతలు
సంబంధిత ట్రేడులో ఐటీఐ 2023, 24, 25 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైనవారు అర్హులు. వయసు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే. ఈ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలి. అంతకంటే ముందు అభ్యర్థులు NCVT/SCVT MIS పోర్టల్లో నమోదు చేసుకోవాలి. చెన్నై ఆవడిలోని CVRDE సెంటర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

