(స్పెషల్ టాస్క్ బ్యూరో )హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ: దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పేది బంగారం నిల్వలే. పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచే దేశాలన్నీ బంగారం నిల్వలు పెంచుకోవడం మొదలుపెట్టాయి.
20వ శతాబ్దం నాటికి బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. దేశంలోని బంగారం నిల్వలకు అనుగుణంగానే కరెన్సీ ముద్రణ కూడా ఉంటుందనేది మనకు తెలిసిన విషయం. కరెన్సీ మార్పిడి రేటు కూడా బంగారం నిల్వల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది.
మరీ ముఖ్యంగా ఆర్థిక అస్థిరత సమయాల్లో దేశాన్ని ఆదుకునేది బంగారం నిల్వలే. బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంతమొత్తం ఉన్నాయన్న జాబితాను తాజాగా ‘ఫోర్బ్స్’ విడుదల చేసింది. ఈ జాబితాలోని టాప్-10 దేశాల్లో అమెరికా 8,1336.46 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో నిలవగా, బంగారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే భారత్ 800.78 టన్నులతో 9వ స్థానంలో నిలిచింది.
టాప్-10 జాబితా నిల్వలు (టన్నుల్లో)
అమెరికా : 8,1336.46
జర్మనీ : 3,352.65
ఇటలీ : 2,451.84
ఫ్రాన్స్ : 2,436.88
రష్యా : 2,332.74
చైనా : 2,191.53
స్విట్జర్లాండ్ : 1,040.00
జపాన్ : 845.97
భారత్ : 800.78
నెదర్లాండ్స్ : 612.45