న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. ఒక ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవేనంటూ లోక్సభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
2023లో రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మరణించారని, గత ఏడాది అత్యధిక మరణాలు నమోదైనట్టు చెప్పారు. జాతీయ రహదారులపై ప్రమాదాల్లో 54,333 మంది మరణించారని, ఇది మొత్తం మృతుల్లో 31 శాతమని చెప్పారు.