న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. వాయు కాలుష్యం వల్ల 2022 ఏడాదిలో దేశంలో 17 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ‘లాన్సెట్’ తాజా నివేదిక పేర్కొన్నది. ఇందులో సగం మరణాలు కేవలం శిలాజ ఇంధనాన్ని (పెట్రోల్, డీజిల్) మండించటం వల్లే సంభవించాయని తెలిపింది.
గత రెండు దశాబ్దాలతో పోల్చితే, అధిక ఉష్ణోగ్రతలతో మరణాలు 300 శాతం పెరిగాయని నివేదిక పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి రూపొందించిన ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ ైక్లెమేట్ చేంజ్-2022’ ప్రకారం, పీఎం 2.5 స్థాయి కాలుష్యం వల్ల అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు ఊపిరితిత్తుల లోపలి భాగాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అనేక వ్యాధులకు ఇదే ముఖ్య కారణం.