ఢిల్లీ: విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తున్నదని వెల్లడించారు. పార్లమెంటులో 2024-25 కేంద్ర బడ్టెట్‌ను (Union Budget) నిర్మలా ప్రవేశపెట్టారు. 9 ప్రధానాంశాల ఆధారంగా ఈ బడ్జెట్ తయారైందన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానమని చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 నూతన వంగడాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచాం
కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం. కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం. విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానం. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 నూతన వంగడాలుపప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కూరగాయల సప్లయ్ చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామన్నారు. సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్లమంది రైతుల డేటా సేకరిస్తామని వెల్లడించారు. సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాలను రూపొందిస్తామన్నారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యం ఇస్తామని నిర్మలా అన్నారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. తయారీరంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుందని పేర్కొన్నారు.