హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘కొంతమంది నాయకులు పాకిస్థాన్‌పై ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌పై ప్రేమను ప్రకటిస్తున్నారు. పాక్‌పై అంత ప్రేముంటే, ఇండియాను విడిచి వెళ్లిపోండి’ అని అన్నారు. ఉగ్రదాడులు జరుపుతున్నా, పాక్‌కు మద్దతుగా నిలబడటం కుదరదని అన్నారు.