జైపూర్, మే 27: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు. తూర్పు రాజస్థాన్లో రెండు రోజులుగా కురిసిన వానలకు 13 మంది మరణించారని విపత్తుల నివారణ శాఖ తెలిపింది.
జార్ఖండ్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల్లో పిడుగుపాటుకు గురై 12 మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా విద్యుత్తు లైన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయి. విద్యు త్తు సరఫరాను పునరుద్ధరించడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్లు పనిచేస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, హర్యానాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాయి.