ఒడిషాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. నూతన సీఎంగా మోహన్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.
భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరయ్యారు.
Read More :
Death Sentence: అత్తను 95 సార్లు పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్ష