శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 23, 2021 , 00:39:04

వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడాలి

వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడాలి

నారాయణపేట, ఫిబ్రవరి 22 : జిల్లాలోని మక్తల్‌, న ర్వ, ఊట్కూర్‌, మాగనూర్‌ మండలాల్లోని వివిధ గ్రా మాల్లో వేసిన పలు రకాల పంటలపై అడవి పందులు, జింకలు, నెమళ్లు గుంపులు గుంపులుగా వచ్చి నష్ట పరుస్తున్నాయని భారతీయ కి సాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకోబా అన్నారు. కలెక్టర్‌, అటవీశాఖ కార్యాలయ అధికారులకు సో మవారం బీకేఎస్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా మండలాలకు చెందిన గ్రా మాల్లో వేసిన వేరుశనగ, పత్తి, జొన్న పంటలు, కూరగాయల తోటలపై అడవి పందులు, జింక లు, నెమళ్లు దాడి చేస్తున్నాయని, దీంతో రైతు లు తీవ్రంగా నష్ట పోతున్నారని చెప్పారు. కావున అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పం ట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. 

కార్యక్రమంలో బీకేఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌, మండల అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీను, కాళేశ్వర్‌, అనంత్‌రెడ్డి, రంగారెడ్డి, మల్లికార్జున్‌, దశరథ్‌, రైతులు పాల్గొన్నారు. 


VIDEOS

logo