‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
నందమూరి కల్యాణ్ రామ్ కు ఎంత ఇమేజ్ ఉందనే సంగతి పక్కనబెడితే భిన్నమైన కథలు చేస్తాడనే పేరు మాత్రం వచ్చేసింది. ఇప్పటికే ఈయన కెరీర్ లో చాలా విభిన్నమైన సినిమాలున్నాయి.

నందమూరి కల్యాణ్ రామ్ కు ఎంత ఇమేజ్ ఉందనే సంగతి పక్కనబెడితే భిన్నమైన కథలు చేస్తాడనే పేరు మాత్రం వచ్చేసింది. ఇప్పటికే ఈయన కెరీర్ లో చాలా విభిన్నమైన సినిమాలున్నాయి. అప్పట్లో వచ్చిన అతనొక్కడే నుంచి హరే రామ్, ఓం త్రీడి లాంటి సినిమాలు చేసాడు కల్యాణ్ రామ్. అలాగే యిజం లాంటి జోనర్ కూడా టచ్ చేసాడు. అలా చేస్తూనే పటాస్ లాంటి అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ తోనూ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టాడు కల్యాణ్ రామ్. రెండేళ్ళ కింద 118 అంటూ సూపర్ థ్రిల్లర్ జోనర్ చేసాడు నందమూరి హీరో. ఇప్పుడు బింబిసార అంటూ మరో అదిరిపోయే ఫాంటసీ సినిమాతో వస్తున్నాడు.
తాజాగా జులై 5న కల్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాల ప్రకటన వరసగా వస్తున్నాయి. అందులో దిల్ రాజు నిర్మాణంలో కేవీ గుహన్ దర్శకత్వంలో ఓ మర్డర్ మిస్టరీ చేస్తున్నాడు. 118 కాంబినేషన్ ఈ చిత్రంతో మరోసారి రిపీట్ అవుతుంది. దాంతో పాటు అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే మరో సినిమా కూడా వస్తుంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే స్వాతంత్య్రం నాటి కథ అనేది అర్థమవుతుంది.
అందులోనూ కల్యాణ్ రామ్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. నాటి ఏజెంట్స్ ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. శ్రీనివాస అవసరాలతో బాబు బాగా బిజీ సినిమాను తెరకెక్కించిన తర్వాత నవీన్ మేడారం నుంచి మరో సినిమా రాలేదు. చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నాడు నవీన్. కల్యాణ్ రామ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి బయటికి వచ్చి పిస్టల్ తో గురి పెట్టిన కళ్యాణ్ రామ్ లుక్ కు ఫిదా అయిపోతున్నారు నందమూరి అభిమానులు. మొత్తానికి ఈ బ్రిటీస్ సీక్రెట్ ఏజెంట్ ఏం చేస్తాడో చూడాలి.
To tell the Untold Story &
— BA Raju's Team (@baraju_SuperHit) July 5, 2021
To solve the Unfold Mystery
Presenting @NANDAMURIKALYAN as British Secret Agent 🇬🇧 “ #DEVIL ”
▶️https://t.co/TCHtRfjCsh
A Pan India Film 🇮🇳by
🎬@NaveenMedaram
💰@AbhishekPicture #AbhishekNama
✍️@SrikanthVissa
🥁@rameemusic #DevilFirstLook pic.twitter.com/kL9yR29B7H
ఇవి కూడా చదవండి..
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

