ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 22, 2021 , 00:34:54

ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేయించాలి

ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేయించాలి

  • ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

నారాయణపేట, ఫిబ్రవరి 21 : ప్రతిఒక్కరూ ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేయించాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కా ర్యాలయంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదు కార్యక్రమా న్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ క్రియాశీలక, సాధారణ సభ్యత్వాలు నమోదు చేసుకోవాలన్నారు. వివిధ సంక్షేమ పథకాలతోపాటు పార్టీ తరఫున సభ్యత్వం ఉండడంతో రూ.2లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధ్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌సాగర్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ముమ్మరంగా సభ్యత్వాలు

ఊట్కూర్‌, ఫిబ్రవరి 21 : మండల వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న ది. మండలంలోని కొల్లూర్‌, బిజ్వారం, సంస్థాపుర్‌ గ్రా మాల్లో నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేయించారు. ప్రభుత్వం బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి నల్లా సౌకర్యం తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్త లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు న్యాయం

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 21 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని మాజీ కౌన్సిలర్‌ నారాయణమ్మ అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి పెద్ద సంఖ్యలో సభ్య త్వం పొందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ డీసీసీబీ చైర్మన్‌ వెం కటయ్య, నాయకులు పాల్గొన్నారు. 

సంక్షేమమే ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పని చే స్తుందని మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌ అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో బీసీ కాలనీలో పలువురితో సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కా ర్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

సభ్యత్వ నమోదు ప్రారంభం

నారాయణపేట రూరల్‌, ఫిబ్రవరి 21 : మండలంలోని శేర్నపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  జెడ్పీటీసీ అం జలి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ కార్యకర్తలంతా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిం చి సభ్యత్వ నమోదులో మండలాన్ని జిల్లాలోనే అగ్రస్థానం లో ఉండేటట్లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుండప్ప, సింగిల్‌ విండో డైరెక్టర్‌ రాంచందర్‌, మాజీ డైరెక్టర్‌ నర్సింహులు, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo