శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 17, 2021 , 00:56:27

భరోసా కల్పించాలి

భరోసా కల్పించాలి

  • ఎస్పీ

నారాయణపేట, జనవరి 16 : కేసుల విచారణలో పారదర్శకంగా పని చేస్తూ బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ చేతన అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ల వారీగా యూఐ కేసులను తగ్గించేందుకు విధించిన టార్గెట్‌లను ఛేదించాలని సీఐలు, ఎస్సైలకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్‌, భూ వివాదాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో తల దూర్చరాదని ఆదేశించా రు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నేరాల అదుపునకు ఈ పెట్టి కేసులు, ఈ చలాన్‌ కేసులు నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అప్లికేషన్‌, సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌పై అధికారులకు ప్రొజెక్టర్‌ ద్వా రా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు శంకర్‌, ఇఫ్తకర్‌ అహ్మద్‌, శివకుమార్‌, రామ్‌లాల్‌, ఎస్సైలు, ఐటీ కోర్‌ టీం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo