టీఎస్జీఎల్ఐపై అవగాహన అవసరం

నారాయణపేట రూరల్ : తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా పథకం (టీఎస్జీఎల్ఐ)పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డీఈవో రవీందర్ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో టీఎస్జీఎల్ఐపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టీఎస్జీఎల్ఐ స్టిక్కర్లు, వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల సం క్షేమం తపస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ టీఎస్జీఎల్ఐ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. తపస్ రాష్ట్ర నాయకుడు గుంపు బాలరాజు, జిల్లా అధ్యక్షుడు శేర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీఎస్జీఎల్ఐ ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీమా పాలసీ అని 2021 జనవరి నాటికి జిల్లాను టీఎస్ఎల్ఐ సమస్యల రహిత జిల్లాగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో లు రాజేంద్రకుమార్, వెంకటయ్య, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, సీతారాములు, గురునాథ్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.