మంగళవారం 19 జనవరి 2021
Narayanpet - Nov 26, 2020 , 02:31:12

రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలి

 రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలి

నారాయణపేట టౌన్‌: సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని వార్డు కౌన్సిలర్‌ జొన్నల అనిత గుత్తేదారుకు సూచించారు. బుధవారం పట్టణంలోని 2వ వార్డులోని టంసల్‌వాడీ ప్రాంతం లో సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జొన్నల సుభాష్‌, మాజీ కౌన్సిలర్‌ అలెనూర్‌ వినోద్‌, దేవరాజ్‌, శివశంకర్‌, సీతారాములు, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.