కట్టంగూర్, అక్టోబర్ 26 : కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంగా మారనుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి మండలంలోని కల్మెర, పరడ, నారెగూడెం, నల్లకుంటబోలు, ఈదులూరు, పందెనపల్లి గ్రామాల్లో గురువారంఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారని, ఎట్లా సరిపోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐందేండ్లలో నలుగురు సీఎంలను మా ర్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయదన్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి సరిపడా కరెంటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రస్తుతం ఐదు గంటల కరెంట్ ఇస్తుండడంతో అక్కడి రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదల కష్టాలు తెలుసుకున్న సౌమ్యుడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఆదరించి మరోసారి గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ పేద వర్గాల అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ అని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచులు పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, పుట్ట సుజనావెంకట్రెడ్డి, కురిమిల్ల పూలమ్మ, పొన్నబోయిన లింగమ్మాశ్రీను, ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, తవిడబోయిన భవాని, నాయకలు గాజుల బుచ్చమ్మ, చిట్యాల రాజిరెడ్డి, పొన్న అంజయ్య, నకిరేకల్ నర్సింహ, ఇప్పలపల్లి శ్రీను, ముప్పిడి యాదయ్య, పొతరాజు నగేశ్, మందుడ్ల వెంకన్న, బుడిగ సత్తయ్య, జీడిపల్లి సురేందర్, బద్దం శ్రీను పాల్గొన్నారు.
నకిరేకల్ : మండలం పాలెం గ్రామానికి చెందిన కల్లెపల్లి నర్సింహ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కు టుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.అలాగే గ్రామానికి చెందిన కల్లెపల్లి వెంకన్న ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నారు. ఆయన్ను పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఆయన వెంట షీప్ అండ్ గోట్స్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జడ్పీటీసీ మాదధనలక్ష్మీ నగేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, సర్పంచ్ ఏకుల కవిత ఉన్నారు.
నార్కట్పల్లి: బీఆర్ఎస్తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేదల సంక్షేమం సాధ్యమవుతుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రా మంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికీ అందాయని అందుకోసం కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, సర్పంచ్ మేడి పుష్పలతా శంకర్, కొండూర్ శంకర్ పాల్గొన్నారు.