శాలిగౌరారం, జనవరి 17 : శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. నిధులు దుర్వినియోగం చేశారని, సమయానికి విధులకు హాజరు కావడం లేదని స్థానిక ఎంపీడీఓపై మండలంలోని భైరవుని బండ గ్రామానికి చెందిన, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగే నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదుదారుడు, ఎంపీడీఓ ఇరువురి సమక్షంలో విచారణ చేపట్టారు. ఇరువురి నుండి వివరాలను సేకరించారు. రికార్డును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు, పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు వెల్లడించారు.