మునుగోడు, ఆగస్టు 21 : లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో గురువారం “యువ వికాస్” కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల, గురుకుల బాలికల జూనియర్ కాలేజీ (కమ్మగూడెం) లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధనపై ప్రేరణాత్మక ఉపన్యాసాలు అందించడంతో పాటు, వారితో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. మోటివేషనల్ స్పీకర్స్, లయన్ పూర్ణ శశికాంత్, లయన్ దీపికా మామిడిపల్లి విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలపై చర్చిస్తూ, సమయం విలువ, కష్టపడి చదివే అలవాటు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, టీమ్ వర్క్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ యువ వికాసం కార్యక్రమం విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగ పడుతుందన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ ఛైర్మన్ & క్లబ్ ఎక్స్టెన్షన్ కో-చైర్మన్, పీఎంజేఎఫ్ లయన్ యర్రమాద శ్రీనివాస్ మాట్లాడుతూ.. లీడర్షిప్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ వినియోగం, సర్వీస్ మైండ్సెట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్స్ పుష్పలత, సంధ్య సహకారాన్ని క్లబ్ సభ్యులు అభినందించారు. క్లబ్ అధ్యక్షుడు ఎంజేఎఫ్ లయన్ నారబోయిన రవి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి లయన్ పాలకురి నరసింహ, సెక్రటరీ లయన్ మిర్యాల వెంకటేశం సమన్వయం చేశారు. అలాగే లయన్ మిర్యాల శ్రీనివాసులు, నారబోయిన సుధాకర్, రావిరాల కుమార స్వామి తదితరులు సహకరించారు.