రామగిరి, మే 21 : ఎన్సీసీ 31 (టి) బెటాలియన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ‘యువ ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్ఎంఏ), ఎన్సీసీ ఆధ్వర్యంలో నీట మునిగిన వారిని రక్షించే అంశంపై పానగల్‌లోని ఉదయ సముద్రంలో ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. బోట్లు, లైఫ్ జాకెట్స్, ఇతర రక్షణ సామగ్రిని ఉపయోగించి నీటి మునిగే ప్రమాదాలు సంభవించినపుడు బాధితులను ఎలా రక్షించాలి అనే అంశంపై మాక్ డ్రీల్లో శిక్షణ అందించారు. అదే విధంగా వాస్తవ విపత్తు పరిస్థితుల్లో సంభవించే ప్రమాదాల్లో ఎస్సీసీ విద్యార్థుల పాత్రను వివరించి వారిలో స్ఫూర్తి నింపారు. శిక్షణలో ఎన్సీసీ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్రావు, సుబేదార్మోజర్ మాధవరావు, కొమ్ము మల్లయ్య, డీఆర్డీఓ ఏపీడీ హరీష్ కుమార్, ఎన్డీఎంఏ ప్రతినిధులు సాయి, దీపక్, ఎంజీయూ ఎన్సీసీ అసిస్టెంట్ అదికారి డా.మచ్చేందర్, వివిద కళాశాలల ఎన్సీసీ అధికారులు భాగ్యలక్ష్మీ, శివకుమార్, తేజస్వీని పాల్గొన్నారు.

కొనసాగుతున్న ‘యువ ఆపద మిత్ర’ శిక్షణ