కోదాడ, నవంబర్ 9 : పచ్చని తెలంగాణపై వ్యతిరేక శక్తుల కుట్రలను ఖండిస్తూ ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షను కొట్లాడి సాధించిన ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం.
– కుట్రలను ఛేదిస్తూ ఒక్కటైతున్నరు (మొదటి పేజీ తరువాయి)
సస్యశ్యామలంగా ఉంటుందని నమ్మి గులాబీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలువకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల వేణుయాదవ్ గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు నేతృత్వంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా వేణుయాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీ ద్వారా గొల్లకుర్మలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కాపాడుకుంటారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మోతె మండలాధ్యక్షుడు శీల సైదులు పాల్గొన్నారు.