– 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.4 లక్షల స్కాలర్షిప్స్
– అందజేసిన వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శరత్ చంద్ర మౌనిక
రామగిరి, జనవరి 26 : ఎంబీబీఎస్ విద్య అభ్యసించే 20 మంది పేద విద్యార్థులకు నల్లగొండలోని వైఆర్పీ ఫౌండేషన్ సోమవారం ఆర్థిక చేయుత అందించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలిశాల రవి ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ సంస్థ కార్యాలయంలో విద్యార్థులకు ఈ సాయం అందించారు. రూ.4 లక్షల స్కాలర్షిప్స్ను విద్యార్థులకు ఫౌండేషన్ డైరెక్టర్ ఎలిశాల శరత్ చంద్ర మౌనిక, ఫౌండేషన్ నల్లగొండ కన్వీనర్ యామా దయాకర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతోనే ఎలిశాల రవి ప్రసాద్ చేయూతనిస్తూ సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యామ కవితా దయాకర్, వైఆర్పీ ఫౌండేషన్ సభ్యులు సురేశ్, శ్రీదేవి పాల్గొన్నారు.

Ramagiri : పేద విద్యార్థుల చదువుకు “వైఆర్పీ” చేయుత