Suicide | మిర్యాలగూడ, మార్చి 6 : మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఉన్న జామాయిల్ చెట్టుకు సుమారు 25 ఏళ్లు ఉన్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బూడిద రంగు టీషర్టు ధరించి ఉన్నాడని.. బ్లాక్ లోయర్ ధరించి ఉన్నట్లు తెలిపారు.
సుమారు 5.4 అడుగుల పొడవు కలిగి చామన ఛాయ కలర్ లో ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ యువకుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్స్ లోకేశ్ తెలిపారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు