కట్టంగూర్, జూన్ 26 : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోవత్స సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం కట్టంగూర్ పోలీస్ శాఖ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. మాదకద్రవ్యాల తయారీ, రవాణా, విక్రయం, వినియోగం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవాల రహీత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు అంజయ్య, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది దేవేందర్, దుర్గాప్రసాద్, గంట శంకర్ పాల్గొన్నారు.