గట్టుప్పల్, మే 30 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 1న నిర్వహించే రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి శుక్రవారం కోరారు. జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, తమ రక్తదానంతో ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో భాగస్వాములై ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.