ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 28 : ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుషి గణేష్ (26) తన ఇంటి మరమ్మతు పనుల్లో భాగంగా సిమెంట్ పనుల కోసం ఇనుప పైపులతో గోవా ను ఏర్పాటు చేశారు. ఇంటి మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఇనుప పైపులను గణేశ్ తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు 10 మీటర్ల దూరంలో ఉన్న తీగలకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గణేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.