నార్కట్పల్లి, జూన్ 02 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పామనగుళ్లకు చెందిన చెరుకు మహేశ్ (24) బైక్పై నార్కట్పల్లికి కూరగాయలు తీసుకోవడం కోసం వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా మరొక బైక్ వచ్చి ఢీకొనడంతో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.