రామగిరి, జూన్ 20 : నేటి ఆదునిక సమాజంలో శారీరక ఆరోగ్యంకై ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరమని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని శనివారం ముందస్తుగానే యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ యోగా గురువు నాగేశ్వర్రావు హాజరై వివిధ యోగాసనాలు వేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ యోగా మనస్సుకు స్పష్టత, ఏకాగ్రత, చైతన్యాన్ని ఇస్తుందని విద్యార్థులు, యువత దీర్ఘకాలిక శారీరక, మానసిక శ్రేయస్సు కోసం ప్రతిరోజూ యోగా అభ్యాసం చేయాలన్నారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరం : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
యోగా ప్రత్యేకంగా విద్యార్థుల చదువు, దృష్టి, ఆత్మానుబంధం, ఆచరణలో సహాయ పడుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొ. డా.మారం వెంకటరమణరెడ్డి, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా.వై.శ్రీనివాస్ రెడ్డి, ఆర్.మురళీ, వర్సిటీ వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ పీవోలు డా.రామచంద్రుడు, డా.ఆనంద్, రామచంద్ర మిషన్ ప్రతినిధులు వెంకటాచారి, జోగారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, క్యాంపస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరం : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నల్లగొండలో ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష ఆదేశాల మేరకు జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్-1, యూనిట్-2 సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కళాశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్.కే.సుల్తానా, ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ రజిత, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.కె సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్ ఏ.నీలిమ, ఎన్.అపర్ణ, డాక్టర్ మాధవి పాల్గొన్నారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరం : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్