రామగిరి, జూన్ 19 : ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే యోగా దినోత్సవ పోస్టర్లను గురువారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. కామర్స్ అండ్ బిజనెస్ మేనేజ్మెంట్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -4 ఆధ్వర్యంలో విద్యార్థులకు గత వారం రోజులుగా యోగా శిక్షణ నిర్వహించి చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. యూనిట్ ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి డాక్టర్ నీలకంఠం శేఖర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రేమ్‌సాగర్, వివిధ యూనిట్స్ పీఓలు పాల్గొన్నారు.