చందంపేట, సెప్టెంబర్ 21 : ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు యాసాని రాజవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా పోలేపల్లి స్టేజి వద్ద రాజ వర్ధన్ రెడ్డి ఆర్థిక సాయంతో లైన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులొ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల వారు గిరిజనులు ఉచిత మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్యాంపులో సుమారు 350 మంది కి వైద్యo అందించారు. ఈ కార్యక్రమంలో పద్మా రెడ్డి, రుక్మా రెడ్డి, మల్లయ్య, సత్యనారాయణ, నీల రవికుమార్, నీల బుచ్చయ్య, రాము చౌహన్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య ఉన్నారు.