భక్తులతో కిటకిటలాడిన యాదగిరి గుట్ట
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్‌క్స్ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి.
యాదగిరిగుట్ట, మార్చి22 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్‌క్స్ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, వీవీ ఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది. ఉత్సవ మూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారు జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. ఖజానాకు రూ. 57 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

