యాదగిరిగుట్ట, డిసెంబర్ 25 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మూడోరోజు సోమవారం స్వామివారికి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించారు.
అనంతరం నవ కలశ పూజలు, నమ్మాళ్వారుకు అభిషేకం జరిపారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి ఉదయం శ్రీరాముడు.. సాయంత్రం వేంకటేశ్వరుడి అలంకారంలో దర్శనిమిచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో గుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాంతో మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి.