యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసిం హుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన నారసింహా హోమం ద్వారా శ్రీవా రిని కొలిచి, సదుర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు.
ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను వీక్షించారు.
దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరా ధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. ఆలయంలో దర్శంన అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీ నారసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.