తుర్కపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మహిళలు, యువతులు ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
భువనగిరి అర్బన్ : పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలు జరుపుకొన్నారు. కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇండ్ల ముంగిట్లో రంగు రంగుల ముగ్గులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, పీఏసీఎస్ డైరెక్టర్ బొబ్బల యాదిరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల మధు, పార్టీ సెక్రటరీ జనరల్ ఎర్ర మల్లేశ్, నాయకులు యాదయ్య, కృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ సునీతకు శుభాకాంక్షలు… ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి బైరోజు వెంకటచారి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, కార్మిక సంఘం నాయకుడు గట్టికొప్పుల లక్ష్మయ్య, ఎస్సీ సెల్ నాయకుడు తాల్క శత్రజ్ఞ ఉన్నారు.
చౌటుప్పల్ : కొవిడ్ ఉధృతి దృష్ట్యా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఇండ్లల్లోనే జరుపుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మోత్కూరు : మున్సిపాలిటీ కేంద్రంలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహంలో సంక్షేమాధికారి ప్రసన్న విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి స్థానికులకు శుభాకాంక్షలను తెలిపారు. ఎస్ఐ జి. ఉదయ్‌కిరణ్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే పలువురి శుభాకాంక్షలు
రామన్నపేట : మండలంలో ప్రజలు న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. టీఆర్ఎస్ నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చెర్వుగట్టులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, సింగిల్‌విండో చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, సీఐ మోతీరాం, ఎస్ఐ వెంకటయ్య, సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, దోమల సతీశ్, గాదే పారిజాత, ఎండీ ఆమేర్, నాయకులు అంతటి రమేశ్, పోతరాజు సాయికుమార్, పోచబోయిన మల్లేశం, బొక్క మాధవరెడ్డి, బద్దుల రమేశ్, బండ శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.