యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము నాలుగు గంటల నుం చి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వ హించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజూ నిర్వ హించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపం లోనే ఊరేగించారు.
లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.
పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.